పెళైన చాలా రోజులకు హానీమూన్ చేసుకున్న జంట
సెలబ్రిటీ అంటేనే హాడావుడి. అది ఏ దేశంలోనైనా సాధారణం. సెలబ్రిటీ అయినా కూడా చాలా సాధారణమైన వ్యక్తులులాగా వ్యవహారించారు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ రీసి వితర్ స్పూన్, జిమ్ టోత్ దంపతులు. రిసీ వితర్ స్పూన్ నిజమైన ఫ్యామిలీ లేడిగా వ్యవహారించారు. తన ఇద్దరు పిల్లలు, భర్త కలసి సరదాగా హానీమూన్ ట్రిప్ వేశారు. ఈ హానీమూన్ ట్రిప్ మొత్తం ఆరు రోజులు కూడా పారిస్ (సిటీ ఆఫ్ లవ్)లో ఎంజాయ్ చేశారు.
రీసి వితర్ స్పూన్, జిమ్ టోత్ ఇద్దరూ కూడా పెద్ద సెలబ్రిటీలు అయినప్పటికీ ఓ సాధారణ రెగ్యులర్ టూరిస్ట్‌లకు మల్లే పారిస్ మొత్తం చుట్టివచ్చారు. పెళ్లి అయి చాలా రోజులు అయినప్పటికీ వీరిద్దరూ కూడా రోమాంటిక్ ట్రిప్‌లో చాలా అన్యూనంగా కనిపించడం విశేషం. ట్రిప్ అంతా పూర్తి అయిన తర్వాత ఈ జంట ఛార్జెస్ డి గాల్లీ ఎయిప్ పోర్ట్‌కి రావడం జరిగింది. ఎయిర్ పోర్ట్‌లో కూడా ఇద్దరూ సామాన్య వ్యక్తులు మాదిరే ప్రదర్శించడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురి చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
Share your views...
0 Respones to "పెళైన చాలా రోజులకు హానీమూన్ చేసుకున్న జంట"
Post a Comment