ఆగస్టు 12న నాగచైతన్య 'దడ' విడుదల





నాగచైతన్య హీరోగా శ్రీ కామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అజయ్‌ భూయాన్‌ దర్శకత్వంలో శివప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న 'దడ' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్‌ 12న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ - ''నాగచైతన్య, కాజల్‌ జంటగా రూపొందుతున్న 'దడ' చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాం. ఆగస్ట్‌ 12న హండ్రెడ్‌ పర్సెంట్‌ ఈ సినిమాని రిలీజ్‌ చేస్తాం. సినిమా చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. కంప్లీట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో నాగచైతన్య పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌లెంట్‌గా వుంది. దేవిశ్రీప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ డెఫినెట్‌గా పెద్ద హిట్‌ అవుతుంది.

ఈనెల 24న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో వైభవంగా జరపనున్నాం. 'దడ' చిత్రాన్ని ఆగస్ట్‌ 12న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేస్తున్నాం'' అన్నారు.

అక్కినేని నాగచైతన్య, కాజల్‌ అగర్వాల్‌, శ్రీరామ్‌, సమీక్ష, డా. బ్రహ్మానందం, ఆలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌రిషి, కెల్లీడార్జ్‌, తనికెళ్ళ భరణి, వేణుమాధవ్‌, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఉత్తేజ్‌, ఇయాజ్‌ఖాన్‌, కులదీప్‌, జునైద్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి కథ: అజయ్‌ భూయాన్‌, శివసింగ్‌, మాటలు: అబ్బూరి రవి




Share your views...

0 Respones to "ఆగస్టు 12న నాగచైతన్య 'దడ' విడుదల"

Post a Comment

 

© 2010 Cinemamasti.com All Rights Reserved