ఆయేషా టకియా నాగార్జునని మర్చిపోలేనంటోంది
సూపర్ సినిమాలో హీరోయిన్ గా నాగార్జున జంటగా చేసిన ఆయేషా టకియా ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఈ మద్యన మన మీడియాకు చిక్కిన ఆమె నాగార్జునని ఓ రేంజిలో పొగిడేస్తోంది. ఆమె మాటల్లోనే..సౌత్‌లో నేను నటించిన ఏకైక సినిమా ‘సూపర్’. ఆ సినిమానీ, అందులో హీరో నాగార్జుననీ మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ సినిమా నా లైఫ్‌లో ఓ తీయని జ్ఞాపకంగా నిలిచిపోయింది అంది.
అలాగే... సౌత్‌లో ఉన్న హీరోలందరిలో నాగ్ చాలా రొమాంటిక్. అలాంటి హీరోతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఛాన్స్ వస్తే తెలుగులో మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది. దక్షిణాది దర్శకుల్లో, నటుల్లో, టెక్నీషియన్స్‌లో వృత్తి పట్ల అంకితభావం ఎక్కువ. అంతేకాదు హీరోయిన్స్ ని గౌరవించడంలో బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది ఎప్పుడూ ముందే ఉంటుంది అని శెలవిచ్చింది.ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం ‘మోద్’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది.

Tags: nagarjuna, puri jagannath, super, నాగార్జున, పూరీ జగన్నాధ్, సూపర్
Subscribe to:
Post Comments (Atom)
Share your views...
0 Respones to "ఆయేషా టకియా నాగార్జునని మర్చిపోలేనంటోంది"
Post a Comment