బడా నిర్మాతల కార్యాలయాలపై అధికారుల దాడులు
సర్వీస్ టాక్సు చెల్లించక పోవడంతో సినిమాటోగ్రఫీ అధికారులు మూవీ ప్రొడక్షన్ ఆఫీసులపై సోమవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలయిన గీతా ఆర్ట్స్(అల్లు అరవింద్), వెంకటేశ్వర ఫిలింస్ (దిల్ రాజు), శ్రీ సాయి గణేష్ ఫిలింస్(బెల్లం కొండ సురేష్), ఆర్‌ఆర్ మూవీ మేకర్స్ (వెంకట్) కార్యాలయాలపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఆఫీసుకు సంబంధించిన అకౌంట్స్‌ను పరిశీలించారు. సంవత్సరన్నరగా వీరంతా టాక్స్ కట్టడం లేదని అధికారుల తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ ను జరిమానాతో సహా వారి నుంచి వసూలు చేసినట్లు సమాచారం.

Subscribe to:
Post Comments (Atom)
Share your views...
0 Respones to "బడా నిర్మాతల కార్యాలయాలపై అధికారుల దాడులు"
Post a Comment