ఎప్పుడైనా ఎక్కడైనా నిర్మాత మురుగదాస్
'గజిని' చిత్ర దర్శకుడు మురుగదాస్, హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా 'ఎంగేయుం-ఎప్పోదుం' ( ఎప్పుడైనా-ఎక్కడైనా)అనే చిత్రాన్ని రూపొందించింది. జరు, శర్వానంద్, అనన్య, అంజలి ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. మురుగదాస్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన శరవణన్ దర్శకత్వం వహించారు. చెన్నరు సత్యం ధియేటర్‌లో ఆడియోను ప్రముఖ హీరో సూర్య విడుదల చేశారు.
ఈ సందర్భంగా మురుగదాస్ మాట్లాడుతూ హాలీవుడ్‌కు చెందిన ఫాక్స్‌స్టార్ సంస్థ హిందీలో పలు చిత్రాలను నిర్మించిందన్నారు. తొలిసారిగా తమిళంలో చిత్ర నిర్మాణం చేపట్టాలనుకోవడం తమిళ చిత్ర పరిశ్రమకే గర్వకారణమన్నారు. వాణిజ్యపరంగా కూడా విజయం సాదిస్తే, సంస్థ మరిన్ని చిత్రాలను నిర్మించేందుకు ముందుకు వస్తుందన్నారు. అలాంటి సమయంలో అనేకమంది నూతన సాంకేతిక నిపుణలకు అవకాశం కల్పించ్చని తెలిపారు. నటుడు సూర్య మాట్లాడుతూ అంతర్జాతీయ చిత్ర నిర్మాణ సంస్థ తమిళంలో చిత్రాలను రూపొందించాలనుకోవడం, మురుగదాస్ కూడా తన అసిస్టెంట్లకు అవకాశం కల్పించాలనుకోవడం అభినందనీయమన్నారు.
Subscribe to:
Post Comments (Atom)

Previous Article
Share your views...
0 Respones to "ఎప్పుడైనా ఎక్కడైనా నిర్మాత మురుగదాస్"
Post a Comment