చిరుకి కాబోయే కోడలి గురించే అంతా..
ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ చిరంజీవి కాబోయే కోడలు.అంతేగాక చిరంజీవి అభిమానులు కూడా ఎవరీ ఉపాసన అని ఫోన్స్ ద్వారా ఫిల్మ్ సర్కిల్స్ లో ఎంక్వైరీలు చేస్తున్నారు. అంతేగాక అటు ఉపసనా కుటుంబానకి కూడా కంగ్రాట్స్ అంటూ ఫోన్సో లో శుభాకాంక్షలు వర్షం కురుస్తోంది. తెలుగు హీరోలు కూడా చాలమంది రామ్ చరణ్ కి మెసేజ్ లు ద్వారా, ఫోన్ లు ద్వారా విషెష్ చెప్పి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇక ప్రతాప్ రెడ్డి మూడవ కుమార్తె శోభన కామినేని, అనిల్‌ల తనయ ఉపాసన. రామ్ చరణ్ ఆమె వివాహమాడబోతున్నారనే వార్త శనివారం వెలువడింది. ఈ విషయాన్ని శోభన కామినేని మీడియాకు ధ్రువీకరించారు.
చిరంజీవి జన్మదినమైన ఆగస్టు 22న రెండు కుటుంబాలు వివాహానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా ప్రకటిస్తాయి. రామ్ చరణ్ ఇప్పటికే రచ్చ షూటింగ్ లో బీజీ కాగా, ఉపాసనా ప్రస్తుతం అపోలో లైఫ్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఉపాసనా బ్లూక్రాస్‌లో క్రియాశీలక సభ్యురాలిగా పనిచేస్తూనే సర్వైకల్ క్యాన్సర్, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో కీలక ప్రచార బాధ్యతలు చూస్తున్నారు. ఇక రామ చరణ్ చేస్తున్న రచ్చ చిత్రం పూర్తయ్యాక వివి వినాయిక్ చిత్రం ప్రారంభమవుతుంది.

Read More Add your Comment 0 comments
ఆయేషా టకియా నాగార్జునని మర్చిపోలేనంటోంది
సూపర్ సినిమాలో హీరోయిన్ గా నాగార్జున జంటగా చేసిన ఆయేషా టకియా ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఈ మద్యన మన మీడియాకు చిక్కిన ఆమె నాగార్జునని ఓ రేంజిలో పొగిడేస్తోంది. ఆమె మాటల్లోనే..సౌత్‌లో నేను నటించిన ఏకైక సినిమా ‘సూపర్’. ఆ సినిమానీ, అందులో హీరో నాగార్జుననీ మర్చిపోవడం అంత తేలికైన విషయం కాదు. ఆ సినిమా నా లైఫ్‌లో ఓ తీయని జ్ఞాపకంగా నిలిచిపోయింది అంది.
అలాగే... సౌత్‌లో ఉన్న హీరోలందరిలో నాగ్ చాలా రొమాంటిక్. అలాంటి హీరోతో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఛాన్స్ వస్తే తెలుగులో మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది. దక్షిణాది దర్శకుల్లో, నటుల్లో, టెక్నీషియన్స్‌లో వృత్తి పట్ల అంకితభావం ఎక్కువ. అంతేకాదు హీరోయిన్స్ ని గౌరవించడంలో బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది ఎప్పుడూ ముందే ఉంటుంది అని శెలవిచ్చింది.ప్రస్తుతం ఆమె తన తాజా చిత్రం ‘మోద్’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది.

పుట్టవర్తి సత్య సాయిగా వెంకటేష్
సత్య సాయిబాబా జీవిత కథ ఆధారంగా...భక్తిరస చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ ‘సత్యసాయి బాబా’ సినిమా రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ఇటీవలే గురు పౌర్ణమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య్రక్రమం పూర్తి చేసి షూటింగ్ మొదలు పెట్టారు. అయితే ఇందులో ‘బాబా’ పాత్ర ఎవరూ చేస్తున్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సత్య సాయి పాత్ర కోసం ప్రకాష్‌రాజ్, వెంకటేష్ , మరో హీరో పేరును పరిశీలిస్తున్న కోడి.... చివరగా వెంకీ పేరును ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Read More Add your Comment 0 comments
సాక్షి శివానంద్..సహజీవనం...
చాలా కాలంగా తన బోయ్ ప్రెండ్ తో సహజీవనం చేస్తున్నానని అందులో వివాహానికి చోటు లేదని స్పష్టం చేసింది.ఆమె అప్పట్లో సీక్రెట్ గా వివాహం చేసుకుని నటనకు శుభం కార్డు వేసిందనే వార్తలు వచ్చాయి.అయితే సాక్షి అవన్నీ కేవలం తనపై వచ్చిన రూమర్స్ అంటూ కొట్టిపారేసింది.అయితే నటనకు కొద్ది కాలం దూరమయ్యానని చెప్పింది. ఈ గ్యాప్‌లో అమెరికా వెళ్లి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ చదివొచ్చానని వెల్లడించారు. తన తండ్రి వ్యాపారంలో సహాయం చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కన్నడంలో రవిచంద్రన్ సరసన 24/7 అనే చిత్రంలో నటిస్తున్నానని చెప్పింది.ఇక ఆమె అమీద్ దర్శకత్వంలో జయం రవి హీరోగా నటిస్తున్న ఆది భగవాన్ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ షాక్ చేసారు.ఇక సాక్షి అప్పట్లో పెద్ద హీరోల చిత్రాలన్నిట్లోనూ చేసింది.కొంతకాలం పాటు తెలుగులో నెంబర్ వన్ ప్లేసుని ఆక్రమించింది.
Read More Add your Comment 0 comments
బడా నిర్మాతల కార్యాలయాలపై అధికారుల దాడులు
సర్వీస్ టాక్సు చెల్లించక పోవడంతో సినిమాటోగ్రఫీ అధికారులు మూవీ ప్రొడక్షన్ ఆఫీసులపై సోమవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థలయిన గీతా ఆర్ట్స్(అల్లు అరవింద్), వెంకటేశ్వర ఫిలింస్ (దిల్ రాజు), శ్రీ సాయి గణేష్ ఫిలింస్(బెల్లం కొండ సురేష్), ఆర్‌ఆర్ మూవీ మేకర్స్ (వెంకట్) కార్యాలయాలపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఆఫీసుకు సంబంధించిన అకౌంట్స్‌ను పరిశీలించారు. సంవత్సరన్నరగా వీరంతా టాక్స్ కట్టడం లేదని అధికారుల తెలిపారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ ను జరిమానాతో సహా వారి నుంచి వసూలు చేసినట్లు సమాచారం.
Read More Add your Comment 0 comments
దీక్ష సేత్ ను వదల్లేక అల్లు అర్జున్
అల్లు అర్జున్,క్రిష్ కాంబినేషన్ లో వచ్చిన వేదం చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేసిన దీక్ష సేత్ ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. అయితే ఇప్పుడామెను తన చిత్రంలో అల్లు అర్జున్ కావాలని పెట్టించుకున్నట్లు సమాచారం.అయితే హీరోయిన్ గా ఆమెకు ఛాన్స్ ఇవ్వలేము కానీ ఐటం సాంగ్ కు ఆమెను తీసుకుందామని ఒప్పించారని చెప్పుకుంటున్నారు.ఈ సినిమాని యూనివర్సల్ మీడియా పతాకంపై ప్రముఖ నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘హానీ’ అనే టైటిల్ తో పాటు ‘హి ఈజ్ వేరి స్వీట్’ అనే క్యాప్షన్ పెట్టనున్నారు. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ 7న ఆరంభం కానుంది. బన్ని తన భార్యతో కలిసి పర్సనల్ ట్రిప్ కి వెళ్ళాడని, వచ్చే నెల తొలివారంలో వస్తాడని సమాచారం. ఇలియానా కూడా సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ లో పాల్గొననుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Read More Add your Comment 0 comments