ఇక నుంచి సొంత వాయిస్



‘ఏ మాయ చేశావె’ చేస్తున్నప్పుడు నా మైండ్‌లో ఒకటే ఉండేది. ‘నన్ను నమ్మి నాకీ అవకాశం ఇచ్చిన గౌతమ్ మీనన్‌గారిని
నిరుత్సాహపరచకూడదు. హండ్రెడ్ పర్సంట్ జెస్సీ పాత్రకు న్యాయం చేయాలి’ అని ఒకే ఒక్క ఆలోచనతో చేశాను.


ఈ సినిమా విడుదలైన తర్వాత నాకెన్ని ప్రశంసలు వస్తాయి? ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారు? అవార్డ్ వస్తుందా?... లాంటి
 విషయాలేమీ ఆలోచించలేదు. సినిమా విడుదలైన తర్వాత అందరూ అభినందిస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పుడు
 ‘స్పెషల్ జ్యూరీ’ అవార్డు గెల్చుకోవడం మరింత ఆనందంగా, ప్రోత్సాహకరంగా ఉంది.


నాకింత మంచి పాత్ర ఇచ్చిన గౌతమ్ మీనన్‌గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకనుంచి తెలుగులో నా పాత్రలకు
 నేనే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నాను. అందుకని ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాను కూడా.


Read More Add your Comment 0 comments


 

© 2010 Cinemamasti.com All Rights Reserved