కత్తులు దూస్తున్నధోనీ, హర్భజన్
భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్ళు, ఇప్పటి వరకు సన్నిహిత మిత్రులుగా వున్న కెప్టెన్ ధోనీ, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ల మధ్య 'లిక్కర్ బ్యారన్' చిచ్చుపెట్టింది. దీంతో వారు 'లీగల్ బ్యాటిల్''కు సన్నద్ధమౌతున్నారు. 'లిక్కర్ బ్యారన్' విజరు మాల్యాకు చెందిన యుబి స్పిరిట్స్ కంపెనీ ధోనీని బ్రాండ్ అంబాసి డర్‌గా తీసుకొని మెక్‌డొవెల్స్ నెంబర్ -1 ప్లాటి నమ్ తరుఫున ఒక వాణిజ్య ప్రకటనను రూపొందిం చింది. అందులో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ను కించపరిచే రీతిలో చిత్రీకరించారని అతని తరఫు న్యాయవాదులు మెక్ డొవెల్స్కు నోటీసు జారీ చేశారు. ' ఆ ప్రకటన హర్భజన్‌ను అవమానపరచడంతోపాటు అతని కుటుం బాన్ని ,మొత్తం సిక్కు జాతిని కించపరిచే విధంగా వుందని' వారు తమ నోటీసులో పేర్కొన్నారు. 'ఇటు వంటి వాణిజ్య ప్రకటనలు భారత జట్టు ఐక్యతను దెబ్బతీస్తుందని, జాతి వ్యతిరేకంగా వుందని హర్భజన్ తల్లి అవతార్ కౌర్ చేసిన ఆరోపణల మేరకు దివానీ అడ్వకేట్స్ అనే లాయర్ల బృందం ఈ పిటిషన్ దాఖలు చేసింది. విస్కీ ఉత్పత్తిలో మెక్‌డొనాల్డ్‌కు రాయల్ స్టాగ్ ప్రధాన పోటీదా రుకాగా, మన దేశంలో లిక్కర్ బ్రాండ్స్ ప్రచారాన్ని అనుమతించనందున మెక్‌డొవెల్స్ నెంబర్ -1 ప్లాటినం సోడాను, రాయల్ స్టాగ్ క్రికెట్ పరికరాలను అడ్డం పెట్టుకుని ప్రకటనలు యిస్తుంటాయి. మెక్‌డొవెల్ తన ప్రకటనలో హర్భజన్‌ను అవమానకరంగా చిత్రీక రించిందని, దీనికి ఆ కంపెనీ బజ్జీకి, అతని కుటుంబానికి బే షరతు క్షమాపణ చెప్పాలని, పరువు నష్టం క్రింద లక్ష రూపాయలు చెల్లించాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హర్భజన్ తరఫు న్యాయవాదులు నోటీసులు జారీ చేశారు.
