ర్మకు "ఇది ప్రేమకథ కాదు" లీగల్ నోటీసులు
రాంగోపాల్ వర్మ మీడియాలో నానడం తప్ప అన్నట్లుగా ఉన్నది పరిస్థితి. తాజాగా మరియా సుసైరాజ్ జీవితగాధను ఆధారంగా చేసుకుని వర్మ "ఇది ప్రేమకథ కాదు" చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ నెల 19న అన్ని ధియేటర్లలో విడుదల కానుంది.
అయితే ఏంటట..? సినిమా అన్నాక ఏదో ఒకరోజు విడుదల కావాల్సిందేగా అంటారా..? అంతేననుకోండి. కాకపోతే వర్మ సినిమా సాఫీగా మాత్రం విడుదల కాదు. మీడియాలో ఒక రేంజ్‌లో గగ్గోలు పెట్టాక అప్పుడు తెరపైకి దూసుక వస్తుంది. ప్రేక్షకుల్ని థియేటర్లకు ఒడిసిపట్టుక వచ్చేందుకు కావల్సినంత సరుకు చిత్రం విడుదలకు ముందే జరిగిపోతుంది. తాజాగా వర్మ తెరకెక్కించిన ఇది ప్రేమకథ కాదు చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.
పదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న మరియా సుసైరాజ్ ప్రేమికుడిగా చెప్పబడే జెరోమ్ మాథ్యూస్ వర్మకు లీగల్ నోటీసులు పంపాడు. ఇది ప్రేమకథ కాదు చిత్రంలో తన పాత్రను వక్రీకరిస్తూ సినిమా తీశారనీ, ఈ చిత్రం చూస్తే తన కుటుంబం మానసిక వ్యధతో కుంగిపోవడం ఖాయమని నోటీసులో పేర్కొన్నాడు. కనుక వెంటనే ఆ సినిమాను, ఆ సినిమాకు సంబంధించిన వాల్‌పోస్టర్ ప్రమోషన్‌ను ఆపివేయాలంటూ కోరాడు.
కానీ ఇది ప్రేమకథ కాదు చిత్ర నిర్మాత మాత్రం తమ చిత్రం కల్పిత కథ అని బుకాయిస్తున్నాడు. కల్పిత కథ అని చెపుతున్నప్పటికీ తమకు లీగల్ నోటీసులు ఎందుకు పంపిస్తాన్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఈ చిత్రంలో హాటెస్ట్ సన్నివేశాలకేమీ కొదవలేదు. లిప్ టు లిప్ కిస్సుల దగ్గర్నుంచి బెడ్రూం సన్నివేశాలు, బాత్‌రూంలో కలిసి స్నానఘట్టాలు వగైరా.. వగైరా.. యమ హీటెక్కించే సన్నివేశాలున్నాయి. సుసైరాజ్ జీవితకథే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రేరణ అన్నది తెలిసిన విషయమే. మరి ఈ లీగల్ నోటీసులను ఎదుర్కొని రాంగోపాల్ వర్మ చిత్రాన్ని ఎలా విడుదల చేస్తారో వేచి చూడాల్సిందే.

Read More Add your Comment 0 comments