బ్యాంకాక్‌లో 'రచ్చ' చేస్తున్న రాంచరణ్, తమన్నా

రామ్‌చరణ్ హీరోగా, తమన్నా హీరోయిన్గా సంపత్ నంది దర్శకత్వంలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి. చౌదరి సమర్పణలో ఎన్.వి.ప్రసాద్, పారస్జైన్లు సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'రచ్చ'. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ శ్రీలంకలో పూర్తిచేసుకుంది.
"తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ఆగస్టు 15 వరకు జరుగుతుంది. తర్వాత చైనాలో జరుగుతుంది. సంపత్‌నంది చెప్పిన కథ, కథానాయకుడి పాత్ర తీరు మాకు నచ్చి తక్షణమే అంగీకరించడం జరిగింది. మాకు ఏ రేంజ్లో ఈ కథను చెప్పాడో అదే రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెగా అభిమానుల అంచనాల్ని ఈ చిత్రం అందుకునే రీతిలో ఉంటుంది.
